: చంద్రబాబుకు పార్టీ పరంగా 79వ ర్యాంకు!
తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కృషి చేస్తోన్న ఎమ్మెల్యేలకు ర్యాంకులు ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తనకు తాను 79వ ర్యాంకు ఇచ్చుకున్నారు. మొదటి స్థానం మాత్రం తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జోగేశ్వరరావు దక్కించుకున్నారు. విజయవాడ (తూర్పు) ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రెండో స్థానంలో నిలిచారు. కాగా, జిల్లా టీడీపీ అధ్యక్షులకు కూడా ర్యాంకులిచ్చారు. చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులుకు మొదటి ర్యాంకు దక్కగా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుకి రెండో ర్యాంక్ దక్కింది.