: సల్మాన్ లాంటి మనిషిని చూడలేము: ఆకాశానికెత్తేస్తున్న 'కిక్' భామ


ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు దేశంలో బ్యాడ్ బోయ్ ఇమేజ్ ఉండగా, అతని సహనటుల్లో మాత్రం ఆపద్భాందవుడు ఇమేజ్ ఉంది. సల్మాన్ ఖాన్ లాంటి మానవతావాదిని చూళ్లేదని 'కిక్' సినిమాలో అతని సరసన నటించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అతన్ని ఆకాశానికెత్తేస్తోంది. సల్మాన్ ఖాన్ బహుమతులు తీసుకోడని ఆమె చెప్పింది. ఎవరైనా బహుమతులు ఇవ్వాలని భావిస్తే, వాటిని బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ కు ఇవ్వాలని సూచిస్తాడని ఆమె తెలిపింది. బహుమతులు ఇస్తే తానే వాటిని చూస్తానని, తనకు బహుమతులు అవసరం లేదని, అదే బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ కు ఇస్తే అవి ఎవరికి చేరాలో వారిని చేరుతాయని, తద్వారా చాలా మంది ఆనందిస్తారని సల్మాన్ చెబుతాడని ఆమె వెల్లడించింది. ఇతర విషయాలన్నీ పక్కన పెట్టి నిన్ను నువ్వు ప్రగాఢంగా నమ్మితే ఏదైనా సాధిస్తావని సల్మాన్ చెబుతుంటాడని ఆమె పేర్కొంది. తాను కూడా సల్మాన్ స్పూర్తిగా ఏదో ఒకటి చేయాలని భావిస్తుంటానని చెప్పింది. కాగా, చెన్నై వరదల బారినపడిన పేదలకు జాక్వెలిన్ ఇళ్లు కట్టిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News