: తాగునీళ్లు కొనలేని స్థితిలో ఉన్నారు, బీర్లు తాగడం సంస్కృతి కాదు: శివ‌సేన


మ‌హారాష్ట్ర‌లో ఏర్ప‌డిన నీటి ఎద్ద‌డిపై శివ‌సేన మ‌రోసారి తీవ్రంగా స్పందించింది. నీటి ఎద్ద‌డి దృష్ట్యా మరట్వాడాలో మద్యం ఉత్పత్తి కంపెనీలకు నీటి సరఫరాను నిలిపి వేయాలని ఇటీవ‌లే శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్య‌ల్నే ఉటంకిస్తూ శివ‌సేన త‌మ సామ్నా ప‌త్రిక‌లో నీళ్లకు బదులుగా బీర్లు తాగడం సంస్కృతి కాద‌ని పేర్కొంది. ప్రజలు తాగునీటి బాటిళ్లను కొనలేని స్థితిలో ఉన్నారని తెలిపింది. మనుషులను కాపాడేందుకు మాత్రమే నీటిని వినియోగించాలని ప్ర‌భుత్వానికి సూచించింది. ఇప్ప‌టికే అక్క‌డి మ‌ద్యం ఉత్ప‌త్తి కంపెనీలకు 20 శాతం నీటి సరఫరాను నిలిపేశారు.

  • Loading...

More Telugu News