: విజయ్ మాల్యాపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
బ్యాంకులను మోసగించి విదేశాలకు చెక్కేసిన కేసులో ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాపై ముంబై ప్రత్యేక కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మాల్యా ఉదంతంపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద వాదనలు విన్న కోర్టు కొద్దిసేపటి క్రితం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈడీ అందించిన నివేదికతో ఇటీవలే విజయ్ మాల్యా పాస్ పోర్టు సైతం రద్దయిన సంగతి తెలిసిందే.