: గ్యాంగ్ తో కలిసి ఫుల్ ఎంజాయ్ చేశాను...మళ్లీ షూటింగుకి వెళ్లిపోతున్నా: రానా
'నా గ్యాంగ్ తో కలిసి ఫుల్ ఎంజాయ్ చేశా'నని రానా ట్వీట్ చేశాడు. రానా ప్రస్తుతం 'బాహుబలి ది కన్ క్లూజన్', 'ఘాజీ' సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో ఈ మధ్య కాలంలో స్నేహితులతో సరదాగా గడిపేందుకు పెద్దగా టైం దొరకలేదు. తాజా వీకెండ్ లో అలాంటి అవకాశం రావడంతో రానా హైదరాబాదులో రెక్కలు కట్టుకుని వాలిపోయాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ లో గ్యాంగ్ గా పేరు పడిన అల్లరి నరేష్, నాని, సందీప్, రకుల్ ప్రీత్, రెజీనా, తాప్సీ తదితరులతో ఫుల్ ఎంజాయ్ చేశాడు. తరువాత 'ఘాజీ' షూటింగ్ కు వెళ్లిపోతూ, ఇలాంటి గ్యాంగ్ తో గడపడం సంతోషాన్నిస్తుందని ట్విట్టర్లో పేర్కొన్నాడు. 'సంతోషంగా గడిపేశాను, నేరుగా షూటింగ్ కు వెళ్తున్నా'నని రానా ట్వీట్ చేశాడు.