: టెలివిజన్ షోలో హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్థానీ కమెడియన్
పాకిస్థానీల అహంకారాన్ని తెలియజేసే మరో సంఘటన ఇటీవలే ఆ దేశంలోని ఓ టెలివిజన్ షో ప్రసారంతో బయటపడింది. ఓ కమెడియన్ తాను ప్రదర్శిస్తోన్న షోలో భాగంగా 'హిందూ కుత్తా' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దానికి అక్కడే ఉన్న ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. ఈ సంఘటన హిందువులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. పాకిస్థాన్‌లో నివసిస్తోన్న లక్షలాది మంది హిందువుల మనోభావాలను లెక్కచేయకుండా సదరు టెలివిజన్ ఛానల్ ఈ దృశ్యాలను ప్రసారం చేయడం ఆ దేశ దురహంకారాన్ని తెలియజేస్తోంది.