: నా పిల్లలతో కలిసి కూర్చుని టీవీ చూస్తున్నా!: షారుఖ్ ఖాన్
వరస ఫ్లాప్‌లతో నిరాశలో వున్న బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ ఇటీవల విడుదలైన 'ఫ్యాన్' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన 'ఫ్యాన్'ను పబ్లిసిటీ చేయడంలోనూ తీవ్రంగానే శ్రమించిన బాలీవుడ్ బాద్షా ఇప్పుడు కుటుంబ సభ్యులతో గడుపుతూ రిలాక్స్ అవుతున్నాడు. అయితే చాలా రోజుల తర్వాత తన పిల్లలతో కలిసి కూర్చుని టీవీ చూస్తున్నానని షారూఖ్ ట్వీట్ చేశాడు. మరోవైపు మ్యూజిక్ వింటున్నానని, చాటింగ్ కూడా చేస్తున్నానని ఆయన అన్నాడు. ఇక్కడి వరకు బాగానే వుంది కానీ, తన ట్వీట్ చివర్లో 'వాళ్లను, వాళ్ల కౌగిలింతలను మిస్సవుతున్నా'నని చిన్న ఝలక్ ఇచ్చాడు. అయితే ఎవరి కౌగిలింతలను మిస్సవుతున్నాడో మాత్రం చెప్పలేదు. ఈ ట్వీట్‌పై అభిమానులు.. 'షారుఖ్ పలువురు హీరోయిన్ల కౌగిలింతలే మిస్సవుతున్నాడు' అంటూ జోక్ చేస్తున్నారు.