: పోలీసులు సహా 113 మంది నాపై అత్యాచారం చేశారు: ఫిర్యాదులో పేర్కొన్న 16 ఏళ్ల బాలిక
పోలీసులు సహా తనపై 113 మంది అత్యాచారం చేశారంటూ వ్యభిచార గృహం నుంచి తప్పించుకున్న ఓ 16 ఏళ్ల బాలిక ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పశ్చిమబెంగాల్-నేపాల్ సరిహద్దులోని సిలిగురిలో నివాసం ఉండే తనను జాబ్ ఇప్పిస్తానని చెప్పి రోహిత్ భంగారీ(35) అనే వ్యక్తి పుణె తీసుకెళ్లాడని, అనంతరం మరికొందరు వ్యక్తులతో కలిసి వ్యభిచార వృత్తిలోకి దించాడని పేర్కొంది. కొన్ని రోజుల క్రితం బాలిక నుంచి ఫిర్యాదును అందుకున్న పోలీసులు ఈ కేసును తాజాగా పుణెకు బదిలీ చేశారు. 113 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్స్ రాకెట్ నిర్వహిస్తోన్న ఇదే ముఠాకు అదే సమయంలో చిక్కుకున్న 24ఏళ్ల ఓ మోడల్‌తో కలిసి సదరు బాలిక ఢిల్లీ పారిపోవడంతో ఈ ఉదంతం బయటపడింది. కేసుతో సంబంధం ఉన్న కొందరు నిందితులని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. దర్యాప్తును వేగవంతం చేశారు.