: చంద్రబాబుకు విష్ణుకుమార్ రాజు లేఖ!... బ్రాండెక్స్ కార్మికులను ఆదుకోవాలని వినతి


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి బీజేపీ నేత, ఏపీ అసెంబ్లీలో ఆ పార్టీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు కొద్దిసేపటి క్రితం లేఖ రాశారు. నిత్యం ప్రజా సమస్యలపై వేగంగా స్పందించే అలవాటున్న విష్ణుకుమార్ రాజు... తన తాజా లేఖలో బహుళజాతి కంపెనీ బ్రాండెక్స్ లో కార్మికులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని బ్రాండెక్స్ లో వేతనాలు, పీఎఫ్ బకాయిల కోసం మహిళా కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీలో కార్మికులు పడుతున్న ఇబ్బందులను ప్రప్తావిస్తూ చంద్రబాబుకు విష్ణుకుమార్ రాజు లేఖ రాశారు. తక్కువ వేతనాలు ఇస్తూ బ్రాండెక్స్ మహిళా కార్మికులకు తీరని అన్యాయం చేస్తోందని, తక్కువ వేతనాలైనా సరైన సమయానికి ఇవ్వకుండా ఆ కంపెనీ యాజమాన్యం ఇబ్బందులు పెడుతోందని ఆయన వివరించారు. తక్షణమే స్పందించి మహిళా కార్మికులకు న్యాయం చేయాలని చంద్రబాబును కోరారు.

  • Loading...

More Telugu News