: బాలిక వాంగ్మూలంతో శ్రీనగర్‌లో మొబైల్, ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ
ఓ బాలికపై భద్రతా బలగాలు లైంగిక వేధింపులకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ నిరసనలతో అట్టుడికిన శ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా నిలిచిపోయిన ఈ సేవలను ఈరోజు నుంచి పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తనపై వేధింపులకు పాల్పడిన వారు ఆర్మీ జవాన్లు కాదని సదరు బాలిక చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలమివ్వడంతో మొబైల్, ఇంటర్నెట్ సేవలను తిరిగి ప్రారంభించారు. అక్కడ చెలరేగుతోన్న వదంతులను అరికట్టి, ప్రశాంత వాతావరణాన్ని తిరిగి తీసుకురావడం కోసమే మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులపై నిషేధం విధించినట్లు అధికారులు పేర్కొన్నారు.