: బ్రాండెక్స్ వద్ద మరోసారి ఉద్రిక్తత... ఆందోళనకు దిగిన మరో ఆరు యూనిట్ల కార్మికులు


విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ పరిధిలోని బహుళ జాతి కంపెనీ బ్రాండెక్స్ వద్ద మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజుల క్రితం వేతనాల పెంపు, పీఎఫ్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ ఆ కంపెనీకి చెందిన ఓ యూనిట్ లో పనిచేస్తున్న మహిళా కార్మికులు ఆందోళనకు దిగారు. కంపెనీలోకి వెళ్లేందుకు యత్నించిన తమను అడ్డుకున్న కంపెనీ ప్రతినిధులపై వారు రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. అయితే ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఎంట్రీ ఇచ్చి సదరు కంపెనీ నుంచి స్పష్టమైన ప్రకటన ఇప్పించి, కార్మికుల ఆందోళనకు తెరదించారు. తాజాగా నేటి ఉదయం బ్రాండెక్స్ కు చెందిన మరో ఆరు యూనిట్లలో పనిచేస్తున్న మహిళా కార్మికులు కూడా వేతనాలు, పీఎఫ్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా వందలాది మంది మహిళా కార్మికులు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగడంతో మరోమారు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News