: బ్యాంకు రుణంతో విదేశాల్లో ఆస్తులు కొన్న మాల్యా!... ఈడీ ఆరోపణ అవాస్తవమన్న యూబీ గ్రూప్
వ్యాపారం నిమిత్తం బ్యాంకుల వద్ద తీసుకున్న రుణంతో విజయ్ మాల్యా విదేశాల్లో ఆస్తులు కొన్నారట. ఈ మేరకు ఆయనపై మనీ ల్యాండరింగ్ ఆరోపణల కింద నమోదు చేసిన కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. ఈ కేసులోనే తన ముందు విచారణకు హాజరుకావాలని ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈడీ నోటీసులకు అంతగా స్పందించని మాల్యా... ఇఫ్పుడప్పుడే విచారణకు హాజరుకాలేనని చెప్పేశారు. ఐడీబీఐ వద్ద తీసుకున్న రూ.950 కోట్ల రుణంలో మాల్యా రూ.430 కోట్లను విదేశాల్లో ఆస్తులు కొనేందుకు తరలించారట. అయితే, ఈడీ ఆరోపణలను ఖండిస్తూ యూబీ గ్రూప్ తాజాగా వివరణ ఇచ్చింది. ఐడీబీఐ రుణంలో సింగిల్ పైసాను కూడా మాల్యా సొంతానికి వాడుకోలేదని ఆ సంస్థ నిన్న విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.