: వేలానికి అగ్రిగోల్డ్ ఆస్తులు!... ప్రకటనను విడుదల చేసిన ‘హైకోర్టు’ కమిటీ


ఎన్నో కుటుంబాలను నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఆస్తులు ఎట్టకేలకు వేలానికి వచ్చాయి. అధిక వడ్డీల ఆశ చూపిన అగ్రిగోల్డ్ యాజమాన్యం జనం నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించింది. ఆ తర్వాత మెచ్యూరిటీ తీరిన డిపాజిట్లను వాపస్ చేయడంలో ఆ సంస్థ విఫలమైంది. దీంతో నట్టేట మునిగామని లబోదిబోమన్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వందలాది కేసులు నమోదైన ఈ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన హైకోర్టు... సంస్థ ఆస్తులను అమ్మేసి డిపాజిటర్ల సొమ్మును చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అగ్రిగోల్డ్ కు చెందిన పలు ఆస్తుల వివరాలను సేకరించిన కమిటీ వాటిని వేలానికి పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో నేటి ఉదయం రూ.30 కోట్ల విలువ చేసే అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి కమిటీ ప్రకటనను విడుదల చేసింది.

  • Loading...

More Telugu News