: గుడివాడ అమర్ నాథ్ దీక్ష భగ్నం... వైసీపీ నేతను బలవంతంగా ఆసుపత్రికి తరలించిన పోలీసులు
విశాఖ కేంద్రంగా ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాలంటూ వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నాలుగు రోజుల పాటు విశాఖలో అమర్ నాథ్ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. రైల్వే జోన్ కు సంబంధించిన ప్రకటన వెలువడిన తర్వాత మాత్రమే తాను దీక్ష విరమిస్తానని ఆయన ప్రకటించారు. అయితే నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు అమర్ నాథ్ ను బలవంతంగా జీపెక్కించారు. నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న కారణంగా నీరసించిన అమర్ నాథ్ ను పోలీసులు కేజీహెచ్ కి తరలించారు.