: మండు వేసవిలో వర్షపు జల్లులు... చల్లబడిన హైదరాబాదు వాతావరణం


ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనం అల్లాడిపోతున్నారు. అయితే నిన్న సాయంత్రం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఉన్నట్టుండి వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఊహించని విధంగా గాలివాన రావడంతో నిన్న సాయంత్రం నుంచి రాత్రి దాకా నగర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రి కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక నేటి ఉదయం తెల్లవారకముందే నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇదిలా ఉంటే హైదరాబాదుతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు, ఏపీలోని కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.

  • Loading...

More Telugu News