: అదేదో సరదాగా అన్నది... తొమ్మిదూళ్ల చుట్టూ గోడకట్టేవాళ్లు ఎవరున్నారు?: పరిటాల శ్రీరామ్


తొమ్మిది ఊళ్ల చుట్టూ ఎవరు గోడ కడితే వారి పిల్లని చేసుకుంటానని చెప్పారట కదా? మరి మీకు పెళ్లవుతుందా? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ చాలా చమత్కారంగా సమాధానమిచ్చారు. తమ కుటుంబం అంటే తమ గ్రామమని అన్నారు. తమ గ్రామం అంటే తమ ఊరి చుట్టూ ఉన్న ఎనిమిది ఊర్లని చెప్పారు. ఈ ఎనిమిది ఊర్లు ఒకే కుటుంబంలా కలిసిమెలసి ఉంటాయని ఆయన అన్నారు. సంతోషమైనా, బాధైనా తామంతా ఒకే కుటుంబంలా ఉంటామని, అందుకే తమ ఊరు చుట్టూ ఎవరు గోడకడితే వారి పిల్లను పెళ్లి చేసుకుంటానని సరదాగా అన్నానని, తమ ఊరు అంటే తమ తొమ్మిది గ్రామాలని ఆయన చెప్పారు. అయినా తొమ్మిది ఊర్ల చుట్టూ గోడకట్టేవారు ఎవరుంటారండీ? అని ఆయన అన్నారు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు తప్పించుకోవడానికి అలాంటివి చెబుతుంటామని ఆయన నవ్వేశారు.

  • Loading...

More Telugu News