: రూ. 68 వేల కోట్లు లాభపడ్డ టాప్ 9 కంపెనీలు


గత వారంలో మార్కెట్ కాపిటలైజేషన్ పరంగా టాప్ 10 లిస్టెడ్ కంపెనీల్లో 9 కంపెనీలు రూ. 68,023 కోట్ల మేరకు లాభపడ్డాయి. బీఎస్ఈ గణాంకాల ప్రకారం, ఈ ఎలైట్ జాబితాలో కోల్ ఇండియా మాత్రమే నష్టపోయింది. టీసీఎస్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, సన్ ఫార్మా, హెచ్యూఎల్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీలు భారీగా లాభపడ్డాయి. ఐటీ దిగ్గజం టీసీఎస్ ఏకంగా రూ. 18,610 కోట్లు లాభపడి, మార్కెట్ కాప్ ను రూ. 4.97 లక్షల కోట్లకు పెంచుకుంది. హెచ్యూఎల్ రూ. 9,845 కోట్లు లాభపడి రూ. 1.93 లక్షల కోట్లకు, రిలయన్స్ రూ. 8,943 కోట్ల లాభంతో రూ. 3.45 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఐటీసీ రూ. 7,725 కోట్లు, ఓఎన్జీసీ రూ. 5,946 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 5,675 కోట్లు, హెచ్డీఎఫ్సీ రూ. 5,395 కోట్లు, సన్ ఫార్మా రూ. 4,801 కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 1,079 కోట్లు లాభపడ్డాయి. ఇదే సమయంలో కోల్ ఇండియా రూ. 2,242 కోట్ల మార్కెట్ కాప్ ను నష్టపోయింది.

  • Loading...

More Telugu News