: నీళ్లు రాని ప్రాజెక్టులు ఎన్నయితే ఏం?: తెలంగాణపై విరుచుకుపడ్డ దేవినేని
అనుమతి లేని ప్రాజెక్టులను కడుతున్న తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోనుందని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విరుచుకుపడ్డారు. నీరు రాని చోట్ల ప్రాజెక్టులను నిర్మిస్తోందని విమర్శించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనుమతులు లేని ప్రాజెక్టులు నిర్మించాలని చూశారని, టెండర్లు పిలిచి వేల కోట్ల రూపాయలను వృథా చేశారని ఆరోపించిన ఆయన, ఇప్పుడు కేసీఆర్ సర్కారు అదే పని చేస్తోందని అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణా, గోదావరి ఎగువ ప్రాంతాల్లో కడుతున్న ప్రాజెక్టుల వల్ల నదుల్లోకి నీరు రావడం లేదని గుర్తు చేశారు.