: బీహార్ లో విషాదం... రోడ్డు ప్రమాదంలో తెలుగు యాత్రికులు మృతి
ఉత్తర భారతదేశాన్ని చుట్టి రావాలని బయలుదేరిన తెలుగువారి తీర్థయాత్ర విషాదాంతమైంది. ఈ నెల 9వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు ప్రాంతాలకు చెందిన 9 మంది యాత్రలకని బయలుదేరారు. కాశీలో విశ్వేశ్వరుని దర్శనానంతరం గయకు వెళుతుండగా, వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మిగతావారంతా తీవ్రంగా గాయపడ్డారని సమాచారం వచ్చింది. గాయపడిన వారి పరిస్థితి ఏంటి? వారిని ఏ ఆసుపత్రిలో చేర్చారు? తదితర విషయాలపై పూర్తి సమాచారం ఇంకా అందలేదు.