: వివాహం జరుగుతున్న శుభవేళ జర్మనీ సిక్కు దేవాలయంలో పేలుడు


పశ్చిమ జర్మనీలోని ఈసెన్ నగరంలో ఓ సిక్కు దేవాలయంలో పేలుడు సంభవించగా, ముగ్గురు గాయపడ్డారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో, ముఖానికి మాస్క్ ధరించిన వ్యక్తి బాంబును పేల్చాడని ఈసెన్ పోలీసు విభాగం ప్రతినిధి లార్స్ లిండిమాన్ వెల్లడించారు. పేలుడు ధాటికి దేవాలయంలోని పలు కిటికీలు పగిలిపోయానని, గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉందని తెలిపారు. ఘటన వెనుక ఉగ్రవాద హస్తం ఉన్నట్టు తాము భావించడం లేదని తెలిపారు. దేవాలయంలో ఓ వివాహం జరుగుతున్న వేళ ఈ ఘటన జరిగిందని, గాయపడిన వారు పెళ్లికి వచ్చిన అతిథులని వివరించారు.

  • Loading...

More Telugu News