: కోల్ కతా నైట్ రైడర్స్ విజయ లక్ష్యం 143
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఐపీఎల్-9 లో భాగంగా ఈరోజు ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో డేవిడ్ వార్నర్ 13, శిఖర్ థావన్ 6, మోజెస్ హెన్రిక్ 6, మోర్గాన్ 51, దీపక్ హుడా 6, ఓఝా 37, ఆశిష్ రెడ్డి 13, శర్మ 2 పరుగులు చేయగా, భువనేశ్వర్ కుమార్ ఎటువంటి పరుగులు చేయకుండా నాటౌట్ గా నిలిచారు. కాగా, కోల్ కతా నైట్ రైడర్స్ విజయం కోసం 143 పరుగులు చేయాల్సి ఉంది.