: రెండు వికెట్లు కోల్పోయిన ‘సన్ రైజర్స్’
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండు వికెట్లను కోల్పోయింది. మోర్కెల్ బౌలింగ్ లో ఊతప్పకు క్యాచ్ ఇచ్చి శిఖర్ ధావన్(6), ఉమేష్ బౌలింగ్ లో సూర్య కుమార్ యాదవ్ చేతికి చిక్కి డేవిడ్ వార్నర్(13) అవుటయ్యారు. 3.5 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ 25 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో మొయిజెస్ హెన్రిక్, మోర్గాన్ ఉన్నారు. ఐపీఎల్-9 లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ను తిలకించేందుకు అభిమానులు బాగానే చేరుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి ఆశిష్ నెహ్రా స్థానంలో బరిందర్ శరణ్ వచ్చాడు.