: వైఎస్ రాజశేఖరరెడ్డిపై సినిమా... టైటిల్ రోల్ పోషిస్తున్న హీరో సుమన్
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత కథ ఆధారంగా ‘మనసున్న నాయకుడు’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. వైజాగ్ కు చెందిన అడరి రవికుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వైఎస్ పాత్రను హీరో సుమన్ పోషించనున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి పాత్రలో దక్షిణాది నటుడు సత్యరాజ్ కనిపించనున్నారు. ఇతర నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రస్తుతం జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈరోజు లాంఛనంగా ప్రారంభమైందని, జూన్ చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని, మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ‘మనసున్న నాయకుడు’ చిత్ర యూనిట్ తెలిపింది.