: ప్రముఖ కవి, వ్యాఖ్యాత శేషం రామానుజాచార్యులు ఇకలేరు!


ప్రముఖ కవి, పండితుడు, వ్యాఖ్యాత శేషం రామానుజాచార్యులు మృతి చెందారు. ఆయన మృతిపై హైదరాబాద్ లోని ప్రముఖ కవులు, కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు, యాదగిరీశుని ఉత్సవాల్లో శేషం రామానుజాచార్యులు చేసిన వ్యాఖ్యానాలు చాలా ప్రసిద్ధి చెందాయి. ప్రముఖ పత్రికల్లో ఆయన ఎన్నో వ్యాసాలు రాశారు. చింతరామృతం, చైతన్య రేఖలు, సమాలోచన, రంగనాథ వైభవం మొదలైన రచనలు ఆయన చేశారు.

  • Loading...

More Telugu News