: ఆ విద్యార్థి హాబీ ఫేస్‌బుక్‌తో డీల్ కుదుర్చుకునే వరకు వెళ్లింది!
'మాక్స్‌చాన్‌జుకర్‌బర్గ్.ఓఆర్‌జీ' పేరుతో కొచ్చి విద్యార్థి రూపొందించిన ఓ వెబ్‌సైట్ డొమైన్ ఫేస్‌బుక్‌ను ఆకర్షించింది. ఈ డొమైన్‌ను విద్యార్థి సదరు సంస్థకు ఇటీవలే అమ్మేశాడు. దీనిపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇంటర్నెట్ డొమైన్ పేర్లను సొంతం చేసుకునే తన హాబీ ఫేస్‌బుక్‌తో డీల్ కుదుర్చుకునే వరకు తీసుకెళ్లిందని.. వెబ్‌సైట్‌ను విక్రయించిన అమల్ ఆగస్టిన్ చెబుతున్నాడు. కొచ్చిలో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతోన్న అమల్ 'మాక్స్‌చాన్‌జుకర్‌బర్గ్.ఓఆర్‌జీ' పేరుతో ఓ వెబ్‌సైట్ డొమైన్ ను రిజిస్టర్ చేయించుకున్నాడు. దీనిపై ఫేస్‌బుక్ అమితాసక్తి కనబరిచింది. ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ కూతురు మాక్సీమా చాన్ జుకర్‌బర్గ్ సంక్షిప్తనామం దీనికి ఉండడమే వారి ఆసక్తికి కారణం. తనకున్న ఇంటర్నెట్ డొమైన్ పేర్లను సొంతం చేసుకునే హాబీ వల్ల ప్రతిష్టాత్మక ఫేస్‌బుక్ సంస్థతోనే బేరసారాలాడానని అమల్ చెప్పాడు. 700 డాలర్లకు ఈ వెబ్‌సైట్‌ను సొంతం చేసుకుందని, ఫేస్‌బుక్ నుంచి కొంతే ఆదాయం వచ్చినా ఆ సంస్థతో డీల్ కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.