: 'ఈడోరకం ఆడో రకం' చూద్దామంటే మోహన్ బాబుకి టికెట్లు దొర‌క‌లేదట!


జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'ఈడో రకం ఆడో రకం'. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కిన ఈ సినిమాలో రాజ్‌త‌రుణ్‌, మంచు విష్ణు హీరోలుగా న‌టించిన విష‌యం తెలిసిందే. అయితే తన తనయుడు న‌టించిన‌ ఈ చిత్రాన్ని డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు హైదరాబాదులోని ఓ థియేట‌ర్‌లో చూద్దామనుకుంటే.. తాను అనుకున్న స‌మ‌యంలో టికెట్లు దొర‌క‌లేద‌ట‌. ఈ విష‌యాన్ని మోహ‌న్‌బాబు ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. నిన్న ఈ సినిమాను చూడాలనుకున్న మోహ‌న్ బాబుకు టికెట్లు దొరకపోవటంతో నిర్మాత అనీల్ సుంకరను అడిగి ఈరోజుకి టికెట్లు తెప్పించుకున్నారట. త‌న త‌న‌యుడు న‌టించిన సినిమాకి టికెట్లు దొర‌క‌క‌పోవ‌డం, అభిమానుల తాకిడి ఎక్కువ‌వ‌డంతో ఆనందంగా ఉందంటూ ఆయ‌న పేర్కొన్నారు. సినిమా చూద్దామ‌ని టికెట్లు కోరిన ఆయ‌నకు ఈరోజు కూడా తాను కోరిన‌న్ని టికెట్లు దొర‌క‌లేద‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News