: ప్రభుత్వం ఇచ్చే అవార్డులంటే మాకు చాలా గౌరవం!: ప్రియాంకా చోప్రా


పద్మశ్రీ ప్రియాంకా చోప్రా (పీసీ) అని పిలిపించుకోవడానికి సిగ్గుగా ఉందని, అదే సమయంలో చాలా గర్వంగానూ ఉందని పీసీ తెలిపింది. పాప్యులారిటీ, పారితోషికం కంటే ప్రభుత్వం ఇచ్చే అవార్డులనే గౌరవంగా తమ ఇంట్లో భావిస్తారని ఆమె తెలిపింది. తన తండ్రితోపాటు తన కుటుంబంలో చాలా మంది ఆర్మీ నేపథ్యం నుంచి వచ్చిన వారని, దీంతో తమకు ప్రభుత్వం ఇచ్చే పురస్కారాలే గొప్ప గౌరవం తెచ్చిపెడతాయని పీసీ తెలిపింది. క్వాంటికోలో తన సహచరులకు ప్రద్మశ్రీ అంటే ఏంటో తెలియదని...పద్మశ్రీ అంటే ఏంటో వారికి చెప్పే ప్రయత్నం చేస్తానని పీసీ చెప్పింది. పురస్కారాల ప్రదానం రోజున రాష్ట్రపతి తన చీరకు తగిలించిన పద్మశ్రీ పురస్కారం సూచించే మెడల్ ను సాయంత్రం వరకు ప్రియాంక తీయకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News