: తిన్న వాటికి బిల్లు చెల్లించమన్నారని హోటల్ లో విధ్వంసం


ఉత్తరాది రాష్ట్రాల్లో రౌడీ మూకల కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని ఓ హోటల్ కు కొంత మంది యువకులు వెళ్లారు. హోటల్ లో తమకు కావాల్సినవి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుని సుష్టుగా తిన్నారు. అనంతరం హోటల్ సిబ్బంది బిల్లు పట్టుకొచ్చి వారి ముందు పెట్టారు. దీంతో ఆ బ్యాచ్ కు ఆగ్రహం ముంచుకువచ్చింది. దీంతో హోటల్ సిబ్బందిపై దాడులకు దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అడ్డుకున్న సిబ్బందిపై దాడులకు దిగారు. ఈ తతంగం మొత్తం అక్కడున్న సీసీటీవీలో రికార్డు కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందుతులను పట్టుకునే పనిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News