: ఉసురు తీసిన వాషింగ్ మెషీన్... తల్లీకొడుకు మృతి!
సికింద్రాబాద్ సమీపంలోని వారాసిగూడలో విషాదం చోటుచేసుకుంది. అలీమున్నీసా అనే మహిళ ఇంట్లో బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషీన్ ఆన్ చేసింది. ఆమె బట్టలు ఉతుకుతుండగా, వాషింగ్ మెషీన్ కిందపడి నలిగిపోయిన విద్యుత్ వైరు మీదికి నీరు రావడంతో అలీమున్నీసా విద్యుద్ఘాతానికి గురైంది. కరెంట్ షాక్ ధాటికి ఆమె కిందపడిపోవడంతో ఆమె నాలుగేళ్ల కుమారుడు రెహమాన్, తల్లికి ఏమైందోనన్న ఆదుర్దాతో ఆమెను పట్టుకున్నాడు. దీంతో ఆ బాలుడికి కూడా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కిందపడిఉన్న తల్లీకుమారులను చూసిన ఇంటి ఓనర్ ఏమైందని విద్యుత్ నిలిపివేసి ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.