: 'మా షాపు పైకే వస్తారా?' అంటూ పోలీసులపై తిరగబడిన రెండేళ్ల చైనా బుడతడు!


రోడ్డును ఆక్రమించుకుని షాపులు పెడితే, పోలీసులు ఏ క్షణాన్నైనా వచ్చి ఖాళీ చేయిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ, చైనాలో ఏమీ తెలియని ఓ రెండేళ్ల బుజ్జాయి... తమ అమ్మా నాన్నా నిత్యమూ కూర్చునే షాపును ఖాళీ చేయించేందుకు పోలీసులు వచ్చిన వేళ ఏం చేస్తాడు? రెండేళ్లోడు ఏం చేస్తాడని ఆలోచిస్తున్నారా? తనకు దొరికిన పెద్ద కర్రను చేతబట్టుకుని పోలీసులపైకి ఉరికాడు. చుట్టూ జనాలు చూస్తుంటే, కళ్లురుమి చూస్తూ కర్రతో అదిలించాడు. చుట్టూ జనాలు దూరం జరుగగా, కర్రను కోపంతో విసిరేశాడు. ఆపై ఓ పోలీసు వచ్చి బుడ్డోడిని సోఫాలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నించగా, అతని వెంటబడి తరిమాడు. ఇక చిన్నారి కోపం తగ్గే వరకూ చైనా పోలీసులు వాడి దరిదాపులకు కూడా పోలేదట. ఈ దృశ్యాలను అక్కడ చూస్తున్న వారిలో కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టగా, అదిప్పుడు వైరల్ అయింది. ఆ బుడ్డోడు వీడే!

  • Loading...

More Telugu News