: హైదరాబాదులో సాక్షి మహారాజ్!...పోలీసు తూటాతోనే ఉగ్రవాదానికి చెక్ పడుతుందని వ్యాఖ్య


ఉద్రేకపూరిత వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో ప్రత్యక్షమయ్యారు. శ్రీరామనవమి సందర్భంగా నగరంలో నిర్వహిస్తున్న శోభా యాత్రలో పాలుపంచుకునేందుకే ఆయన హైదరాబాదు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన మరోమారు ఉద్రేకపూరిత వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని అణచివేయడం అన్నది పోలీసుల తూటాలకు మాత్రమే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించివేసేందుకు నరేంద్ర మోదీ సర్కారు కృతనిశ్చయంతో ఉందన్నారు. భారత్ మాతాకీ జై అనని వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News