: నెత్తిన ముత్యాల తలంబ్రాలతో కేసీఆర్ మనవడు!... తాతతో కలిసి భద్రాద్రి వచ్చిన హిమాన్షు


భద్రాచలం శ్రీ సీతారామచంద్రమూర్తి కల్యాణోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సతీసమేతంగా హాజరయ్యారు. మెదక్ జిల్లాలోని తన సొంత ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్ లో భద్రాచలం వచ్చిన కేసీఆర్ దంపతుల వెంట వారి మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా వచ్చాడు. పట్టు వస్త్రాలు కలిగిన పళ్లేన్ని కేసీఆర్ నెత్తికెత్తుకోగా, హిమాన్షు ముత్యాల తలంబ్రాలున్న పళ్లేన్ని తలపై పెట్టుకుని వచ్చాడు. ముందుగా కేసీఆర్ అందించిన పట్టు వస్త్రాలను తీసుకున్న అక్కడి పూజారులు ఆ తర్వాత హిమాన్షు నెత్తిపై ఉన్న ముత్యాల తలంబ్రాలను అందుకున్నారు. ఇక వీరి వెంట దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

  • Loading...

More Telugu News