: ఒంటిమిట్టలో ధ్వజారోహణం ప్రారంభం... హాజరైన గంటా, సీఎం రమేశ్
శ్రీరామనవమిని పురస్కరించుకుని కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో కొద్దిసేపటి క్రితం నవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ధ్వజారోహణం కార్యక్రమానికి ప్రభుత్వ ప్రతినిధిగా మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. కోదండరాముడికి ఆయనే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. గంటా వెంట టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి కూడా హాజరయ్యారు. ఇక మరికాసేట్లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా ఈ వేడుకలకు హాజరుకానున్నారు.