: పవన్ కల్యాణ్ ఆ మాటెలా అంటారు?: గల్లా జయదేవ్


తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడం లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం తగదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ హితవు పలికారు. పవన్ కల్యాణ్ ఆ మాటెలా అంటారని ప్రశ్నించిన ఆయన, తాను స్వయంగా పవన్ ను కలిసి అభివృద్ధి ఎలా జరుగుతున్నదో, తామెలా కష్టపడుతున్నామో తెలియజేస్తానని అన్నారు. 2019లో జరిగే ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీతో కలిసుంటామో, ఉండమో తాను చెప్పలేనని, అప్పటివరకూ ఆ పార్టీతో కలిసి నడుస్తామని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందనే నమ్ముతున్నామని, కేంద్రం నుంచి విడతల వారీగా నిధులు అందుతూనే ఉన్నాయని అన్నారు.

  • Loading...

More Telugu News