: ఆ వివాదం ఒవైసీ-ఆర్ఎస్ఎస్ మధ్య డబ్ల్యుడబ్ల్యుఎఫ్ పోరు వంటిది: ఆప్ నేత


‘భారత్ మాతాకీ జై’ అనే నినాదంపై ఒవైసీ, ఆర్ఎస్ఎస్ మధ్య జరుగుతున్న వివాదం డబ్ల్యుడబ్ల్యుఎఫ్ పోరు వంటిదని ఆప్ నేత కుమార్ విశ్వాస్ అభివర్ణించారు. ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్నారు. కాన్పూర్ లోని కిద్వాయ్ నగర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో కుమార్ విశ్వాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,‘భారత్ మాతాకీ జై’ అనే నినాదాన్ని వివాదాస్పదం చేయడాన్ని హైదరాబాద్ ఒవైసీ, నాగపూర్ ఆర్ఎస్ఎస్ మధ్య జరుగుతున్న డబ్ల్యుడబ్ల్యుఎఫ్ పోరు లాంటిదంటూ ‘పంజాబ్ కేసరి’ పత్రికలో ప్రచురించారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లో పీడీపీ-బీజేపీ పొత్తుపై కూడా ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News