: ఏంది సార్ ఎట్టున్నారు...నువ్వే చెప్పాలమ్మీ: సుమ పలకరింపుకు జయప్రకాశ్ రెడ్డి స్పందన
'ఏంది సార్ ఎట్టున్నారు?' అంటూ సుమ అడగ్గా...'నువ్వే చెప్పాలమ్మీ...నువ్వైతే గూడక మంచిగ చెబుతావమ్మీ...ఎట్టున్నాను?' అంటూ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయప్రకాశ్ రెడ్డి అన్నారు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగిన 'సుప్రీం' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, సినిమాలో సాయిధరమ్ తేజ్ బాగా నటించారని అన్నారు. దర్శకుడు తనపై నమ్మకంతో మంచి క్యారెక్టర్ ఇచ్చాడని ఆయన తెలిపారు. నటులు బాగా నటించారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సత్యం రాజేష్ మాట్లాడుతూ, సినిమా సూపర్ హిట్ అనడంలో ఎలాంటి సందేహం వద్దని చెప్పాడు. సాయిధరమ్ తేజ్ అంత పెద్ద ఫ్యామిలీలో పుట్టినప్పటికీ ఇతరులను గౌరవించడంలో గొప్ప సంస్కారం కలిగినవాడని అన్నారు. ఆయన శ్రమ అయనను హిట్ సినిమాల హీరోగా నిలబెడుతోందని ఆయన చెప్పారు.