: గ్యాంగ్ లీడర్ లో విజయశాంతిలా రాశీఖన్నా అదరగొట్టేసింది: హాస్య నటుడు శ్రీనివాస్ రెడ్డి


‘సుప్రీం’ చిత్రంలో రాశీ ఖన్నాను చూస్తే మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ చిత్రంలో విజయశాంతి గుర్తొచ్చిందని నటుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ‘మెగా’ కుటుంబం హీరో సాయిథరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సుప్రీం’ ఆడియో వేడుక హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్రంలో పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించిన రాశీఖన్నా రఫ్ ఆడించేసిందని అన్నారు. ఈ చిత్రంలో రాశీఖన్నా పేరు బెల్లం శ్రీదేవి అంటూ నవ్వులు చిందించాడు. ఈ సినిమా పక్కా మాస్ చిత్రమని, హిట్ ఖాయమని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News