: అది అబద్ధం... జగన్ తోనే ఇబ్బంది: ఎమ్మెల్యే జలీల్ ఖాన్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్ మెంట్ దొరకడం కష్టమని అసత్య ప్రచారం కొనసాగుతోందని, కానీ తాను ఇంత వరకు ఆయన అపాయింట్ మెంట్ తీసుకోకుండానే కలుస్తున్నానని వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, అపాయింట్ మెంట్ లేకుండా చంద్రబాబును కలవవచ్చు కానీ, వైఎస్సార్సీపీ అధినేత జగన్ ను కలవడం అసాధ్యమని అన్నారు. తాను చాలాసార్లు జగన్ ను కలిసేందుకు ప్రయత్నించానని, కానీ అది కుదరలేదని ఆయన చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఈ సారి ఆ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలెవరికీ జగన్ టికెట్లు ఇవ్వరని ఆయన అన్నారు. కనీసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా ఆయన టికెట్ ఇవ్వరని ఆయన పేర్కొన్నారు. జగన్ ఏదనుకుంటే అదే చేస్తారని, ఎవరి మాటా వినరని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News