: మమతా బెనర్జీకి సీఈసీ షోకాజ్ నోటీసులు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నజీమ్ జైదీ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన కారణంగానే ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. కాగా, అసన్సోల్ ప్రాంతంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మమతా బెనర్జీ ఎన్నికలకోడ్ ను ఉల్లంఘించారు. కొత్త జిల్లా ఏర్పాటుకు తాను కృషి చేస్తానని ఆ ఎన్నికల ప్రచార సభలో ఆమె పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ స్థానాలకు విడతల వారీగా పోలింగ్ కొనసాగుతోంది.