: బ్రిటన్ యువరాజు దంపతుల కాళ్లు తొక్కుతూ డ్యాన్స్ చేసిన మూడేళ్ల బుడతడు!


బ్రిటన్ యువరాజు విలియం, భార్య కేట్ మిడిల్టన్ నిన్న అస్సాంలోని కజిరంగా జాతీయ పార్క్ ను సందర్శించిన విషయం తెలిసిందే. కేట్ దంపతులకు పార్క్ లోకి స్వాగతం పలికేందుకు గాను సంప్రదాయ నృత్యం చేసే వారిని కొంత మందిని అక్కడ ఏర్పాటు చేశారు. మూడేళ్ల చిన్నారి కాంఖాన్ అనే బుడతడు కూడా తన తల్లిదండ్రులతో పాటు చూడముచ్చటగా నృత్యం చేశాడు. డప్పు దరువుకు అనుగుణంగా కాళ్లు కదిపిన కాంఖాన్, కేట్ దంపతుల కాళ్లు తొక్కుతూ డ్యాన్స్ చేశాడు. ఏదో ఒకసారో, రెండో సార్లో కాదు, ఆ డ్యాన్స్ అయిపోయేంత వరకు మధ్య మధ్యలో చాలా సార్లు తొక్కాడు. ఇంట్లో పిల్లలు తమ వారిని సరదాగా తొక్కినట్లుగా పదేపదే కేట్ దంపతుల కాళ్లను కాంఖాన్ తొక్కుతుండటంతో చిన్నారి తల్లిదండ్రులు కొంచెం భయపడ్డారు. కేట్ దంపతులకు క్షమాపణలు చెప్పారు. దీనికి కేట్ దంపతులు స్పందిస్తూ, ‘ఏం ఫర్వాలేదు. కాంఖాన్ మా అబ్బాయి జార్జ్ ని గుర్తు చేశాడు. కాంఖాన్ కూడా మా బిడ్డతో సమానమే’ అన్నారు నవ్వుతూ. కాంఖాన్ ను దగ్గరకు తీసుకుని ముద్దు చేశారు. చిన్నారి డ్యాన్స్ బాగుందంటూ చప్పట్లు కొట్టి మరీ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News