: భిక్షమైనా ఎత్తుతాగానీ, టీఆర్ఎస్ లోకి వెళ్లను: డీకే అరుణ
అవసరమైతే బిక్షమెత్తుకునైనా బతుకుతానే తప్ప, అధికారం కోసం తెరాస పంచన చేరబోనని కాంగ్రెస్ మహిళా నేత డీకే ఆరుణ వ్యాఖ్యానించారు. తన సోదరుడు టీఆర్ఎస్ లో చేరడంపై ఈ మధ్యాహ్నం స్పందించిన ఆమె, రామ్మోహన్ రెడ్డి చేసిన పనితో తమ తండ్రి ఆత్మ క్షోభిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు తెలంగాణ రాష్ట్ర సమితి తిలోదకాలు ఇచ్చిందని ఆరోపించిన ఆమె, కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే రామ్మోహన్ రెడ్డితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడే రోజు త్వరలోనే రానుందని అరుణ అంచనా వేశారు.