: ఆయ‌న‌ వల్లే మ‌న‌కు తెలంగాణ వచ్చింది: సీఎం కేసీఆర్‌


భార‌త రాజ్యాంగ నిర్మాత‌ డా.బీఆర్‌ అంబేద్కర్ వ‌ల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈరోజు ట్యాంక్ బండ్ సమీపంలో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. అంబేద్క‌ర్ ఆనాడు రూపొందించిన చట్టం ఎంతో ఆద‌ర్శ‌వంత‌మైంద‌ని అన్నారు. ఆయ‌న రూపొందించిన చ‌ట్టం వ‌ల్లే నేడు తెలంగాణ క‌ల సాకార‌మైంద‌ని వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజం అంబేద్క‌ర్‌కు రుణపడి ఉందన్నారు. రాజ్యాంగం రాసేటప్పుడు దేశంలో ఏదైనా రాష్ట్రం విడిపోవాలంటే అధికారం ఎవరి చేతిలో ఉండాలన్న చర్చ జరిగిందన్నారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు చేసే అధికారం కేంద్రానికే ఉండాలని అంబేడ్కర్‌ చెప్పారని వివరించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 2.60లక్షల ఇళ్లు నిర్మించబోతున్నామని, సుమారు రూ.10కోట్లతో సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ నిర్మాణం చేపడుతున్నామ‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ తెలిపారు.

  • Loading...

More Telugu News