: 300 దాటిన బంగ్లా మృతుల సంఖ్య
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓ వాణిజ్య సముదాయం కుప్పకూలిన దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 300 దాటింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే సహాయక చర్యలు మూడోరోజూ కొనసాగుతున్నాయి. కాగా, తమ సహచరులు మృత్యువాత పడడంతో ఆగ్రహోదగ్రులైన తోటి కార్మికులు నేడు సంఘటన స్థలం వద్ద భారీ ఆందోళనకు దిగారు. దీంతో, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్ప వాయుగోళాలను ప్రయోగించారు. ఆయా సంస్థలు లాభార్జనకే ప్రాధాన్యం ఇస్తున్నాయని, కార్మికుల భద్రతను పట్టించుకోవడంలేదంటూ బంగ్లా వ్యాప్తంగా ఉద్యమకారుల నుంచి విమర్శలు వినవస్తున్నాయి.