: సల్మాన్ 'సుల్తాన్' క్లైమాక్స్ లీక్... సామాజిక మాధ్యమాల్లో చిత్రాలు!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అనుష్మా శర్మలు నటిస్తున్న తాజా చిత్రం 'సుల్తాన్' క్లైమాక్స్ దృశ్యాలు లీకయ్యాయి. ఓ ఇండోర్ స్టేడియంలో చిత్రీకరణ జరుపుతుండగా తీసిన దృశ్యాలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఓ కుస్తీ పోటీలో ఆమె గెలవడం, ఆపై భారత జాతీయ పతాకాన్ని రెండు చేతులతో పట్టుకుని ఆనందాన్ని వ్యక్తం చేస్తుండగా తీసిన ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిని ఎవరు తీసి షేర్ చేశారన్న విషయం వెల్లడికాక పోయినా, పోటీలో అనుష్క విజయం సాధించడంతో చిత్రం ముగుస్తుందని తెలుస్తోంది. వాటిల్లోని ఓ చిత్రాన్ని మీరూ చూడవచ్చు.