: జడేజా పెళ్లికి ఏర్పాట్లు షురూ.. ఆడిపాడనున్న రైనా, బ్రేవో
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(27) పెళ్లికి ముహూర్తం దగ్గర పడుతోంది. బ్యాచిలర్ లైఫ్‌కి ఆయనిక గుడ్ బై చెప్పనున్నాడు. రాజ్‌కోట్‌లో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న హర్దేవ్‌సింగ్ సోలంకి కుమార్తె రీవా(25)తో జడేజా వివాహం ఈనెల 17న గుజరాత్‌లోని కలావడ్ రోడ్ లో వైభవంగా జరగనుంది. ఆ వేడుకల్లో ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ లయన్స్ నుంచి ఆడుతోన్న సురేష్ రైనా, బ్రేవోలు ఆడిపాడనున్నారు. వీరిద్దరు పెళ్లిలో గార్భా డాన్స్ వేయడానికి రెడీగా ఉన్నట్లు టాక్. దీంతో జడేజా పెళ్లి వేడుకలో మరింత హుషారు నిండుకోనుంది. రైనా కూడా కొద్ది కాలం క్రితమే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.