: ఎండ ప్రచండం... వారం ముందే వేసవి సెలవులు!


ప్రజలు తట్టుకోలేనంత స్థాయికి ఎండలు పెరిగిన వేళ, పాఠశాలలకు వారం రోజుల ముందే వేసవి సెలవులు ఇవ్వాలని తెలంగాణ సర్కారు ఆలోచిస్తోంది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలను దాటిన వేళ, చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏ విధమైన దురదృష్టకర ఘటనలూ జరగకముందే సెలవులు ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలు కూడా కోరాయి. ఈ మేరకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యలకు వినతిపత్రం అందించాయి. దీంతో వారం ముందే సెలవులు ఇచ్చే అవకాశాలను ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తోంది. అయితే, అన్ని పాఠశాలలకూ ఒకేసారి సెలవులు ఇవ్వాలా? లేదా స్థానిక పరిస్థితులను బట్టి కలెక్టర్లకు అధికారం ఇవ్వాలా అన్న విషయమై ప్రభుత్వం చర్చిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి ఈ నెల 23 నుంచి పాఠశాలలకు సెలవులు. నేడు, రేపు అంబేద్కర్ జయంతి, శ్రీరామనవమి కారణంగా స్కూళ్లకు సెలవులు. ఆపై శని, ఆదివారాలు. దీంతో వారం ముందు సెలవులు అంటే సోమవారం నుంచే పాఠశాలలు మూతపడనున్నాయి.

  • Loading...

More Telugu News