: మిత్రుడిని కలవడం కోసం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్!
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో దర్శనమిచ్చారు. ఈ సమాచారం అందడంతో అక్కడికి మీడియా చేరుకుంది. అక్కడికి ఆయన ఎందుకొచ్చారో అర్థం కాలేదు. ఎవరిపైన అయినా ఫిర్యాదు చేయడానికా? లేక మరేదైనా విషయమై అక్కడికి వచ్చారా? అని ఆసక్తిగా మీడియా అక్కడికి చేరుకుంది. చాలా సేపటి తర్వాత బయటకు వచ్చిన పూరీ జగన్నాథ్ ను విలేకరులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉదయ్ కుమార్ రెడ్డి తన స్నేహితుడని, ఆయన్ని కలవడం కోసమే స్టేషన్ కు వచ్చానని ఆయన చెప్పడంతో మీడియా వెనుదిరిగింది.