: మరోసారి రాణించిన కోల్ కతా బ్యాట్స్ మన్


ఐపీఎల్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య కోల్ కతాలో జరుగుతున్న టీట్వంటీ మ్యాచ్ లో కోల్ కతా బ్యాట్స్ మన్ మరోసారి రాణించారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా ఆదిలోనే రాబిన్ ఊతప్ప (8) వికెట్ కోల్పోయింది. దీంతో కాస్త జాగ్రత్తగా ఆడిన గంభీర్ (43)కు మనీష్ పాండే (41) జతకలిశాడు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ, చెత్తబంతులను బౌండరీ లైన్ దాటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రధానంగా కెప్టెన్ గంభీర్ ను డిఫెన్స్ కు పరిమితం చేసిన పాండే భారీ షాట్లతో ధాటిగా ఆడుతున్నాడు. దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 99 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ఒక వికెట్ తీసి మెక్ క్లెంగన్ రాణించాడు.

  • Loading...

More Telugu News