: భ‌ద‌త్రా బ‌ల‌గాలు లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ‌లేదు, స్థానిక యువ‌కులే కార‌ణం.. కాశ్మీర్ బాలిక వీడియో విడుద‌ల


ఓ బాలిక‌పై భ‌ద్ర‌తా బ‌ల‌గాలు లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాయంటూ.. శ్రీ‌న‌గ‌ర్‌లో కొందరు చేస్తోన్న ఆందోళ‌న ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు దారి తీయడంతో, అక్క‌డి కొన్ని ప్రాంతాల్లో క‌ర్ఫ్యూ విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌య‌మై జ‌రిగిన‌ కాల్పుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురు చ‌నిపోయారు. అయితే, హింద్వారాకు చెందిన స‌ద‌రుబాలిక భ‌ద్ర‌తా బ‌ల‌గాలు త‌న‌ను లైంగిక వేధింపులకు గురి చేశాయన్న ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ తాజాగా ఓ వీడియో ద్వారా స్పందించింది. అక్కడి జవాను త‌న‌పై లైంగిక వేధింపులకు పాల్పడ‌లేద‌ని, స్థానిక యువ‌కులే తన‌ను వేధించార‌ని బాలిక చెప్తుండ‌గా తీసిన‌ వీడియోను తాజాగా ఆర్మీ విడుదల చేసింది. వీడియోలో జరిగిన సంఘటనను వివరిస్తూ.. త‌న బ్యాగుని స్నేహితురాలికి ఇచ్చి టాయిలెట్ కు వెళ్లి బయటకు వస్తుండగా స్థానిక యువకుడు త‌న‌తో అసభ్యంగా మాట్లాడాడ‌ని, కొంత సేప‌టికి అక్క‌డికి మరి కొందరు యువ‌కులు వ‌చ్చార‌ని చెప్పింది. వారే త‌న‌ను లైంగిక వేధింపుల‌కు గురి చేశార‌ని తెలిపింది.

  • Loading...

More Telugu News