: 7వ పే కమిషన్... పెరిగిన వేతనాల్లో 50శాతం మాత్రమే ఉద్యోగుల జేబుల్లోకి!
ప్రభుత్వ రంగ బ్యాంకుల రీ క్యాపిటలైజేషన్ ఫండ్లో ఉద్యోగులు ఇన్వెస్ట్ చేయడాన్ని ప్రోత్సహిస్తూ ఏడో పే కమిషన్ ద్వారా పెంచిన వేతనాల్లో 50 శాతాన్ని అందుకు తరలించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం పెరిగిన వేతనాల్లో 50 శాతం ప్రభుత్వోద్యోగులకి అందించి, మరో 50 శాతాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల రీ క్యాపిటలైజేషన్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి తరలించాలని చూస్తోంది. అధిక వేతనం పొందే ప్రభుత్వ అధికారులకు లాభదాయక ఇన్సెన్టివ్స్, ట్యాక్స్ రద్దు వంటి ప్రోత్సాహకాలు అందిస్తూ.. పెరిగిన వేతనంలో 50 శాతాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల రీ క్యాపిటలైజేషన్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై తమ బ్యాలన్స్ షీట్లను వచ్చే ఏడాది మార్చి నాటికి క్లీన్ అప్ చేసుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్బీఐ మార్గదర్శకాలను సూచించింది.